మదనపల్లె జంట హత్య కేసులో పోలీసుల విచారణ జరుగుతోంది.. అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి, ఇక తల్లిదండ్రులు మూడనమ్మకం కూతుర్లు తిరిగి వస్తారు అనే ఆలోచనతో చేసిన దారుణం ఇది, చివరకు ఇద్దరు కుమార్తెలు దూరం అయ్యారు, ఇక తాజాగా వీరికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా పెద్ద కుమార్తె అలేఖ్య గురించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, అలేఖ్యకు ప్రియుడు ఉన్నాడంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అనేక వార్తలు రావడంపై పోలీసులు కూడా దీనిపై స్పందించారు అసలు ఇలాంటిది ఏమీ లేదని ఇలాంటి ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది అని వెల్లడించారు.
దీనిపై పూర్తి విచారణ చేస్తున్నారు పోలీసులు..తల్లిదండ్రుల మానస్థిక స్థితి బాగోలేదు. వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. నేడు విశాఖకు తరలించారు, అయితే దీనిపై అన్నీ కోణాల్లో విచారణ చేస్తున్నామని ఇలాంటి అసత్యాలు నమ్మద్దు అంటున్నారు, కొందరు కావాలనే ఫేమ్ కోసం చేస్తున్న పని అని పోలీసులు చెబుతున్నారు.