భారీగా తగ్గిన బంగారం ధర – పెరిగిన వెండి ధర – రేట్లు ఇవే

భారీగా తగ్గిన బంగారం ధర - పెరిగిన వెండి ధర - రేట్లు ఇవే

0
90

బంగారం ధర వరుసగా మూడో రోజు తగ్గుముఖం పట్టింది, చూసుకుంటే గడిచిన మూడు రోజులుగా పుత్తడి వెండి ధరలు కాస్త తగ్గుతున్నాయి …నేడు కూడా బంగారం వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. మరి నేడు బులియన్ మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.

హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 తగ్గింది. దీంతో రేటు రూ.48,820కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.400 తగ్గింది.. దీంతో ధర రూ.44,750కు చేరి ట్రేడ్ అవుతోంది.

ఇక పుత్తడి ఇలా ఉంటే వెండి రేట్లు చూద్దాం..వెండి రేటు మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర రూ.2,200 పెరిగింది. దీంతో రేటు రూ.73,200కు చేరింది. వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందా అంటే తగ్గే సూచనలు ఉన్నాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు.