ఉదయం నానబెట్టిన శనగలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా.. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.. ఇందులో కార్బోహైడ్రేట్, ప్రోటీన్, కొవ్వు, ఫైబర్, కాల్షియం, ఐరన్ అలాగే విటమిన్లు చాలా అధికంగా ఉంటాయి. అంతేకాదు మొలకెత్తిన శనగలు తింటే ఇంకా మంచిది. ఇందులో క్లోరోఫిల్, విటమిన్ ఎ, బి, సి, డి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మంచిని చేస్తాయి.
ఇక నానబెట్టిన ఉడకబెట్టినవి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ముఖ్యంగా ఉప్పు వేసుకోవద్దు నార్మల్ గా ఉడకబెట్టి తినండి దీని వల్ల ఎంతో మేలు, ముఖ్యంగా షుగర్ సమస్య ఉన్నవారికి కూడా ఇది మంచిదే..25 గ్రాముల నానబెట్టిన లేదా ఉడకబెట్టిన చిక్పీస్ను తీసుకోవచ్చు.
ఎవరికి అయినా శరీరంలో రక్తహీనత సమస్య ఉంటే ఇవి తినడం వల్ల సమస్య తగ్గుతుంది, అయితే మంచిది కదా అని రోజు వంద గ్రాములు తింటే మళ్లీ శరీరానికి చేటు అనేది మర్చిపోవద్దు… కడుపు నొప్పి గ్యాస్ అరుగుదల సమస్య వస్తాయి.. అతి అనేది పనిచేయదు.. రోజుకి 10 లేదా 20 గ్రాములు తీసుకుంటే మంచిది లేదా రెండు రోజులకి ఓసారి తీసుకోవచ్చు.