రమణమ్మకి ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు.. పెద్ద కుమారుడు చిరు ఉద్యోగం చేసుకుంటున్నాడు, అయితే పెద్దగా అతను తల్లిని చూసింది లేదు.. ఇక భర్త పోయిన తర్వాత మాత్రం చిన్న కుమారుడితో హైదరాబాదులోనే ఆమె ఉంటోంది …దాదాపు 10 ఏళ్లుగా చిన్న కుమారుడే అన్నీ చూస్తున్నాడు.
ఇక మందులు తిండి ఇలా అమ్మని బాగానే చూసుకుంటున్నాడు, అయితే ఇటీవల ఆమెకి బాగా అనారోగ్యం చేసింది, ముఖ్యంగా ఆమెకి 10 ఎకరాల పొలం తన అమ్మ నుంచి కట్నంగా వచ్చింది.. దానిని అందరూ కూడా ఇంత కాలం చూసుకుంటున్న చిన్న కుమారుడికి ఇస్తుంది అని భావించారు.
ఇక పెద్ద కుమారుడు కోడలు కూడా ఇదే అనుకున్నారు.. కాని ఇటీవల ఆమె చనిపోయే సమయంలో ఆమె తమ్ముడి ఆధీనంలో ఉన్న ఈ పది ఎకరాలు చెరో ఎకరం నా కుమార్తెలకు.. అలాగే మరో 4 ఎకరాలు నా పెద్ద కుమారుడికి.. మరో నాలుగు ఎకరాలు నా చిన్న కుమారుడికి అని వీలునామా రాసింది..