కొన్ని ఆలయాల్లో ఆచారాలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది …నిజమే ఇలాంటి ఆచారాలు పాటించే ఆలయాలు మన దేశంలో వందల్లో ఉన్నాయి, అనేక చోట్ల ప్రసాదాలు కూడా చాలా వెరైటీగా ఉంటాయి, ఇప్పుడు మనం చెప్పుకునే ఆలయం కూడా అంతే చాలా వింతైన ఆలయం.మధ్యప్రదేశ్లోని రాత్లాం నగరంలో మహాలక్ష్మీ ఆలయానికి ఎక్కడా లేని విశిష్టత ఉంది.
ఇక్కడ ప్రసాదంగా ఏమి ఇస్తారో తెలుసా.
భక్తులకి ఇక్కడ బంగారం వెండి నాణాలు ప్రసాదంగా ఇస్తారు..ఇలా చాలా కాలంగా ఇస్తున్నారట, మరి ప్రతీ రోజూ ఇలా ఇస్తారా? అసలు ఈ స్టోరీ ఏమిటి అనేది చూద్దాం.. ప్రతీ సంవత్సరం దీపావళీ రోజుల్లో ఈ ఆలయానికి వచ్చే భక్తులు అమ్మవారికి వెండి, బంగారు ఆభరణాలు, డబ్బును కానుకలుగా సమర్పిస్తుంటారు.
భక్తులు కిలోల కొద్ది దీనిని సమర్పించుకుంటారు.. వందల కోట్ల కానుకలు వస్తాయి, ఈ సమయంలో ఆ డబ్బు బంగారం వెండి అంతా అమ్మవారి దగ్గర ఉంచుతారు. ఈ సమయంలో భక్తులకి ఇలా బంగారు నాణాలు ఇస్తారు.. కాని వీటిని అమ్మడం వేరే వస్తువుల కోసం కరిగించడం, అంతేకాదు తనఖా పెట్టడం చేయకూడదు. పూజ గదిలో పెట్టి అమ్మవారిని పూజిస్తారు, మరింత లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని భక్తుల నమ్మకం.