చాలా సీరియల్లు మనంచూస్తున్న సమయంలో కొన్ని లాజిక్ లేని సీన్స్ కనిపిస్తూ ఉంటాయి..
సినిమాలే కాదు సీరియల్లో కూడా.. ఇలా సీరియల్ అలా చూడాలి అనే డైలాగులు వినిపిస్తాయి, ఇక ఇలాంటి సీరియల్స్ లో
ఆ వీడియోలని మీమ్స్ గా కూడా చాలా మంది వాడుతున్నారు.. సోషల్ మీడియాలో అనేక సీన్లు ఇలా
వైరల్ అవుతున్నాయి..
తాజాగా ఇలాంటి సీన్ ఒకటి కనిపించింది, ససురల్ సిమార్ కా అనే హిందీ సీరియల్లోని ఓ సీన్ ట్విట్టర్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఇక్కడ మీరు సీన్ చూడండి చేతితో పట్టుకున్న శాలువా ఆమె మెడకు చుట్టుకుంటుంది ఏకంగా బిగిసిపోతుంది
అసలు చేతిలో పట్టుకున్న శాలువా మెడకు అంత గట్టిగా ఎలా బిగుసుకుందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు నెటిజన్లు.
ఈసీన్ చూసి దర్శకుడు ఆలోచన మాములుగా లేదు అంటున్నారు… ఇక దీనిపై అనేక రకాల కామెంట్లు మీమ్స్ వస్తున్నాయి.
మొత్తానికి ఇలాంటి సీన్లు చూసి ఆశ్చర్యపోతున్నామని అంటున్నారు నెటిజన్లు.
మీరు ఆ వీడియో చూడండి
— No Context Violence (@NoConViolence) January 29, 2021