ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ జరుగుతోంది, ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రాబోతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు త్రివిక్రమ్.. అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి, అయితే ఈ సినిమాలో నటుల ఎంపిక ఇక ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.
త్రివిక్రమ్ ఇప్పటికే స్టోరీ పూర్తి చేశారు.. నటులతో చర్చలు జరిపారు.. అయితే ఇందులో విలన్ గా ఓ ప్రముఖ హీరో నటిస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి.. ఎన్టీఆర్ కి విలన్ తమిళ సూపర్ స్టార్ హీరో శింబు నటిస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక తెలుగులో కూడా ఆయనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.. ఈ సినిమాలో ఆయన విలన్ గా నటిస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి.
అలాగే కమెడియన్ సునీల్ కూడా ఈ సినిమాలో నటించనున్నారు, ఇక చిత్రంలో ఇద్దరు అందాల తారలు హీరోయిన్లు ఉంటారు అని తెలుస్తోంది..బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ వరీనా హుసేన్ పేర్లు వినిపిస్తున్నాయి.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ సీనియర్ పొలిటీషియన్ గా నటిస్తారట.