ఎఫ్ 2 సినిమాకి సీక్వెల్ ఎఫ్ 3 రానుంది…ఇప్పటికే రిలీజ్ డేట్ చిత్ర యూనిట్ ప్రకటించింది.. ఇక సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది.. వరుణ్ తేజ్ వెంకటేష్ షూటింగ్ కు సిద్దం అయ్యారు.. అయితే ఈ సినిమాలో వీరిద్దరే కాకుండా మరో హీరో కూడా ఉన్నాడని అనేక వార్తలు ఇటీవల వినిపించాయి… కాని దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
మాస్ మహారాజ రవితేజ ఈ క్యారెక్టర్ చేస్తున్నాడని ముందు వార్తలు వచ్చాయి, తర్వాత రామ్ పేరు వినిపించింది,
తర్వాత హీరో సాయి ధరమ్ తేజ్ పేరు వినిపించింది. అయితే ఇప్పుడు మరో పేరు వినిపిస్తోంది,
నందమూరి ఫ్యామిలీ హీరో కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఇవ్వడానికి రెడీ అయ్యాడని టాక్ నడుస్తోంది టాలీవుడ్ లో.
అనిల్ రావిపూడి పటాస్ సినిమా చేశారు ఈ సినిమా సూపర్ హిట్ అయింది…అయితే వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ ఆనాడు ఏర్పడింది, దీంతో ఆయన అడగగానే అందుకే ఒకే చేశారు అని వార్తలు వినిపిస్తున్నాయి.. చివరి 10 నిమిషాల్లో ఫుల్ ఫన్ క్రియేట్ చేసే క్యారెక్టర్ అని తెలుస్తోంది. సో దీనిపై ఇంకా ఎలాంటి ప్రకటన అయితే రాలేదు.