మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడు…ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత ఈ చిత్రం తెరకెక్కనుంది.. ఇప్పటికే ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు వినిపించాయి… అయితే అలనాటి తారలకు తన సినిమాల్లో
సూపర్ రోల్స్ ఇస్తూ వారిని హైలెట్ చేస్తున్నారు త్రివిక్రమ్.ఇప్పుడు మరో హీరోయిన్ను తీసుకొస్తున్నారట.
తాజాగా ఈ వార్తలు వినిపిస్తున్నాయి.
ఆమె దాదాపు 17 ఏళ్ల క్రితం సినిమాలో నటించి అందరిని మెప్పించింది.. ఆమె అన్షు అంబాని…
2002లో వచ్చిన మన్మథుడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ అన్షు, ఈ సినిమాలో ఆమె నటనకు చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. తర్వాత ఆమె 2003లో రాఘవేంద్రలో ప్రభాస్ సరసన నటించారు. మిస్సమ్మలో చిన్న పాత్ర చేశారు.
ఇక తర్వాత వెండి తెరపై కనిపించలేదు.
అయితే తాజాగా ఎన్టీఆర్ సినిమాలో ఆమె నటిస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. అన్షు 2003లో లండన్‌కు చెందిన సచిన్ సాగర్‌ను వివాహం చేసుకున్నారు ఆమెకి ఇద్దరు పిల్లలు.