వైఎస్ షర్మిల కొత్త పార్టీ గురించి ఇప్పుడు ఏపీ తెలంగాణలో జోరుగా చర్చ జరుగుతోంది, రాజన్నరాజ్యం తీసుకువస్తాను అని షర్మిల చెప్పడంతో ఇప్పుడు ఏపీలో తెలంగాణలో రాజకీయ నేతలే కాదు ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు, తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ కాంగ్రెస్ ఎదురునిలుస్తున్నాయి
ఇలాంటి వేళ కొత్తగా రాజకీయ పార్టీ వస్తుంది అనేది కాస్త ఆసక్తికరంగా మారింది. ఇక దీనిపై మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. షర్మిల కొత్త పార్టీ వెనుక ఉన్నది సీఎం కేసీఆర్ అని ఆయన ఆరోపణలు చేశారు, ఇక కాంగ్రెస్ ను దెబ్బ తీయాలి అని షర్మిలని రంగంలోకి దించారు అని కామెంట్లు చేశారు ఆయన
షర్మిల కేసీఆర్ వదిలిన బాణమని వైఎస్ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఆయన ఈ పాలన అందించారు అనేది మర్చిపోవద్దు అన్నారు… తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది తెలంగాణ బిడ్డలు రాజ్యం ఏలాలని మాత్రమే అని రాజన్నబిడ్డలు రాజ్యం ఏలాలని కాదని రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు.