కాజల్ అగర్వాల్ సౌత్ ఇండియాలో ఎంతో ఫేమ్ ఉన్న హీరోయిన్, ఆమె అందరూ స్టార్ హీరోలతో సినిమాలు చేశారు.. ఇప్పటీకీ టాప్ హీరోల సినిమాల్లో ఆమె నటిస్తున్నారు… ఇక తెలుగు తమిళ చిత్రాలతో వరుసగా బిజీగా ఉంది కాజల్… ఇటీవలే పెళ్లిచేసుకున్న ఆమె సినిమాలు కూడా చేస్తున్నారు.
తాజాగా ఆమె ఓ విషయాన్ని తెలియచేసింది… ఈ విషయం ఇప్పటి వరకూ ఎవరికి తెలియదు. తన గురించి తెలిపింది. కాజల్ కు ఐదేళ్ల వయసు నుంచి బ్రాంకియల్ ఆస్తమా వ్యాధి ఉందట. దీంతో ఆమె ఎంతో ఇబ్బంది పడేది అని తెలిపింది.
ముఖ్యంగా శీతాకాలం వస్తే చాలా ఇబ్బందిపడేదట, ఇది మరింత ఎక్కువగా ఉండేది..ఆస్తమా వల్ల ఆహారం విషయంలో కూడా తాను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పింది. ఈ సమస్య వల్ల తాను ఇన్ హేలర్ వాడతానని కాజల్ తెలిపింది. ఈ విషయం చెప్పడంతో అభిమానులు షాక్ అయ్యారు, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అని కోరుతున్నారు.