స్కూల్లో టీచర్స్ చెప్పే పాఠాలపై విద్యార్దులు ఎంతో ఆసక్తి చూపిస్తారు, ఇక కొందరు టీచర్లు ఇలాంటి సైన్స్ పాఠాలు చెప్పి చిన్న చిన్న ప్రయోగాలు చేయమని చెబుతారు, ఇలా ప్రయోగాలు చేస్తే ఈజీగా అర్దం అవుతాయి అని ఉపాధ్యాయుల ఆలోచన.
లండన్‌లో మాత్రం.. టీచర్స్ చెప్పిన సైన్స్ పాఠం విని ఓ బాలుడు ప్రయోగం చేసి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. ఇదేమిటి ఏం జరిగింది అని ఆలోచిస్తున్నారా ఇప్పుడు తెలుసుకుందాం.
టీచర్ చెప్పిన అయస్కాంత గురుత్వాకర్షణ లెసన్ విన్నాడు మారిసన్ అనే కుర్రాడు..
అయితే మన శరీరానికి అయస్కాంతం ఉంటే మనం ఏమీ పట్టుకోవక్కర్లేదు కదా, అదే పట్టుకుంటుంది కదా అని ఆలోచన చేశాడు.. దీని కోసం 54 మాగెటిక్ బాల్స్ కడుపులోకి మింగాడు. ఇవికడుపులోకి వెళ్లాక అతనికి అస్వస్దత చేసింది వెంటనే పేరెంట్స్ కి చెప్పాడు, ఇక వారు ఆస్పత్రికి తీసుకువెళ్లారు
ఎమర్జెన్సీ శస్త్రచికిత్స నిర్వహించి మాగెటిక్ బాల్స్‌ని బయటకి తీశారు. ఒక్కసారిగా ఈ ఘటన పెను వైరల్ అయింది ఇప్పుడు అతను బాగానే ఉన్నాడు.