మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు, ఇక కోవిడ్ సమయంలో దాదాపు 9 నెలలు సినిమా షూటింగులు నిలిచిపోయాయి, తాజాగా కోవిడ్ తగ్గడంతో షూటింగులు మళ్లీ వేగంగా జరుగుతున్నాయి… అయితే తాజాగా ఆచార్య సినిమా పూర్తి చేసుకున్నారు చిరంజీవి.. ఇక సినిమా విడుదల తేదీ కూడా వచ్చేసింది.
ఇక తాజాగా మలయాళ చిత్రం లూసిఫర్ రీమేక్ చేస్తున్నారు, అలాగే తమిళ చిత్రం వేదాళం రీమేక్ చేస్తున్నారు, లూసిఫర్ రీమేక్ బాధ్యతలు ఎ.మోహన్రాజాకి అప్పగించారు దర్శకుడు ఆయనే.. ఇక
వేదాళం రీమేక్‌ను మెహర్ రమేష్ తెరకెక్కించనున్నారు.
తాజాగా యంగ్ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో ఓ సినిమాను చేయబోతున్నట్లు అధికారికంగా తెలియజేశారు చిరంజీవి, అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి బాబీ వర్క్ పూర్తి చేస్తున్నారట,డైరెక్టర్ బాబి, మైత్రీ మూవీస్ ప్రీ ప్రొడక్షన్ పనులను ఇప్పటిక స్టార్ట్ చేశాయి అని వార్తలు వినిపిస్తున్నాయి, అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ల పేర్లు పరిశీలిస్తున్నారట…శ్రుతిహాసన్–రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని టాలీవుడ్ టాక్, చూడాలి వీరిద్దరిలో ఎవరిని ఫైనల్ చేస్తారో.