ఇటీవల యువత సోషల్ మీడియాలో పలు బ్యూటీ టిప్స్ గురించి సమాజానికి చెబుతున్నారు, అంతేకాదు పలు విషయాలు జాగ్రత్తలు చెబుతూ ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు… ఇక రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు… మరింత అందంగా కనిపించేందుకు స్టైల్ లుక్ కోసం అనేక కొత్త ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు…ఇటీవల డూ ఇట్ యువర్సెల్ఫ్ అంటూ యువత పలు బ్యూటీ టిప్స్ను పంచుకుంటోంది.
లూసియానాకు చెందిన టెస్సికా బ్రౌన్ అనే యువతి ఇంట్లో హెయిర్ స్ప్రే బాటిల్ అయిపోయింది. హెయిర్ స్ప్రేకు బదులుగా గొరిల్లా గ్లూ జిగురును తలకి రాసుకుంది… జుట్టు అంతా ఈ గ్లూ రాసుకుంది…. దీంతో జుట్టు దారుణంగా మొత్తం మాడుకి అంటుకుపోయింది.
ఎన్నిసార్లు తలస్నానం చేసినా సరే.. ఆ గమ్ వదల్లేదు. తనకు ఇలాంటి పరిస్దితి ఎదురైంది ఎవరూ ఇలాంటి పనులు చేయకండి అని టిక్ టాక్ లో చెప్పుకుంది… ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందుకే ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు మాత్రం చేయకండి అంటున్నారు వైద్యులు.
వీడియో చూడండి.
https://www.instagram.com/p/CK2qf_ugq9A/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again