డెమెట్రియస్ లూయిస్ అనే నిందితుడిని పోలీసులు ఫ్లొరిడాలోని బ్రావర్డ్ కౌంటీలో కోర్టు సమావేశాలకు హజరుపరిచారు, ఈ సమయంలో ఆన్ లైన్ లో కోర్టు నడుస్తోంది, అతను చోరీ కేసులో నిందితుడు అయితే అక్కడ లేడీ జడ్జి అందానికి ఆ నిందితుడు ఫిదా అయిపోయాడు.
ఇక అతను చేసిన నేరం మర్చిపోయి.. మీరు చాలా అందంగా ఉన్నారు, మీకు ఐలవ్ యూ చెబుతున్నా అని అన్నాడు.. దీంతో ఆమె కాసేపు నవ్వుకుంది… అయితే నీ ట్రిక్స్ ఇక్కడ పనిచేయవు..ఇలా పొగడ్తలతో పడేయడం ఎక్కడైనా చెల్లుతుందేమో.. కానీ కోర్టులోకాదు అని గట్టి కౌంటర్ ఇచ్చారు జడ్జి తబితా బ్లాక్మాన్ .
ముగ్గురు పిల్లలు ఉన్న ఇంటిలో దొంగతనం చేశాడు అతను , చివరకు అతనికి 5 వేల డాలర్లు ఫైన్ వేశారు, అంతేకాదు గతంలో నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష వేసినా మళ్లీ ఇలా దొంగతనాలు చేస్తున్నాడు ఈసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
వీడియో మీరు చూడండి
Attachments area
Preview YouTube video Defendant tries (and fails) to flirt with Broward judge during bond court appearance