వడ్డే నవీన్ తెలుగు చిత్ర సీమలో ఎంతో గుర్తింపు పొందిన చిత్రాల్లో ఆయన నటించారు, మంచి హీరోగా ఫేమ్ సంపాదించారు
నవీన్…1990 లో అనేక సూపర్ హిట్ సినిమాలు చేశారు, కమర్షియల్ హీరోగా కూడా పేరు సంపాదించారు…అయితే
ముప్పలనేని శివ దర్శకత్వంలో వచ్చిన కోరుకున్న ప్రియుడు సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు.
1997లో కోడిరామకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన పెళ్లి చిత్రం ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది… ఇక తర్వాత వరుసగా మనసిచ్చి చూడు మా బాలాజీ, ప్రేమించే మనసు, చాలా బాగుంది, చక్రి , ఇలా అనేక సినిమాలు చేసి విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు..
తర్వాత ఆయన సినిమాలు ఇక చేయలేదు..వడ్డే నవీన్ తండ్రి వడ్డే రమేష్ తెలుగులో చాలా సినిమాలు నిర్మించారు.
ఇక తనకు ఉన్న వ్యాపారాలతో ఆయన బీజీగా మారారు సినిమాలకు దూరంగా ఉంటున్నారు… ఇక ఆయన నందమూరి కుటుంబానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నారు అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు..ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ కూతురు చాముండేశ్వరిని నవీన్ వివాహం చేసుకున్నారు, అయితే ఆయన ఇంకా సినిమాల్లో నటించాలి అని ఆయన అభిమానులు ఇప్పటీకీ కోరుకుంటున్నారు.