మహేశ్ బాబు ప్రస్తుతం సర్కారువారి పాట చిత్రం చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది..చిత్ర టీమ్ అంతా అక్కడ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.. కొద్ది రోజుల క్రితం ప్రిన్స్ దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే, దాదాపు నెల రోజులుగా ఇక్కడే షూటింగ్ జరుగుతోంది, అయితే ఇక్కడ సీనియర్ నటులు అలాగే మహేష్ బాబు కీర్తి సురేష్ లతో సీన్స్ తీస్తున్నారు.
కొన్ని యాక్షన్ దృశ్యాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. త్వరలో ఈ దుబాయ్ షెడ్యూలు పూర్తికానుంది. ఇక ఈ నెలాఖరున దుబాయ్ నుంచి ఇండియా రానున్నారు చిత్ర యూనిట్.. అయితే నేరుగా మహేష్ బాబు గోవా వెళ్లనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
గోవాలో తదపరి షూటింగ్ షెడ్యూల్ నిర్వహించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.బ్యాంకింగ్ రంగంలో చోటుచేసుకుంటున్న కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమా తీస్తున్నారు.. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు, ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం రానుంది.