ఫోర్ వీలర్ వాడే వాహనదారులు అందరికి కూడా ఇక తమ వాహనాలకు కచ్చితంగా ఫాస్టాగ్ ఉండాల్సిందే.. దేశ వ్యాప్తంగా ఫాస్టాగ్ నిబంధన అమలులోకి వస్తోంది, ఇప్పటికే 80 శాతం ఫాస్టాగ్ వాడుతున్నారు.. ఇక దీనిని త్వరలో 100 శాతం చేయనుంది కేంద్రం, ఇక దీని కోసం వాహనదారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు, తాజాగా వ్యాలెట్లో కనీస నిల్వ ఉండాలన్న నిబంధనను ఎత్తివేస్తున్నట్టు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
దీంతో ఇక మినిమం అనే మాట లేదు కనీస నిల్వ అకౌంట్లో లేకపోవడం వల్ల చాలా వరకూ వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు, ప్లాజాల దగ్గర రద్దీ ఏర్పడుతోంది.ఫాస్టాగ్ ఖాతాలో కనీస నిల్వ ఉంటేనే టోల్ ప్లాజాల నుంచి వెహికల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
ఈ నెల 15 నాటికి దీనిని వంద శాతానికి తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక బ్యాంకుల దగ్గర పలు సంస్ధలు టోల్ ప్లాజాల దగ్గర ఈ ఫాస్టాగ్ అనేది ఇవ్వడం జరుగుతంది.. ఇంకా ఎవరైనా తీసుకోవలసిన వారు ఉంటే తీసుకోండి.