మెగా హీరోలు వరుస పెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు… ఇక ఖైదీ నెం 150 సినిమాతో టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన చిరు అంతే వేగంగా సినిమాలు చేస్తున్నారు.. తర్వాత సైరాలో మెప్పించారు, ఇక ఆచార్య సినిమాతో మన ముందుకు రానున్నారు, ఈ సినిమా విడుదల తేదీ కూడా వచ్చేసింది.
కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆచార్య తరువాత మలయాళ చిత్రం లూసిఫర్ రీమేక్ లో ఆయన నటిస్తున్నారు.. ఈ సినిమాకి సంబంధించి ప్రకటన వచ్చేసింది..ఇక ఈ సినిమాని
మోహన్ రాజా డైరెక్ట్ చేయనున్నారు.
అయితే ఈ సినిమా తర్వాత ఏం సినిమా చేస్తారో కూడా క్లారిటీ ఇచ్చారు మెగాస్టార్.. దర్శకుడు కేఎస్ రవీంద్ర బాబీతో తన 154వ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నట్లు చిరంజీవి స్వయంగా ప్రకటించాడు.ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ ఈ న్యూస్ రివీల్ చేశారు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది అని తెలిపారు. ఇక ఈ సినిమా కథ వర్క్ లో ఉన్నారట బాబీ.