కొందరు ఈజీ మనీ కోసం ఫేమ్ కోసం అనేక టాస్కులు చేస్తూ ఉంటారు.. అలాంటి పనుల వల్ల వారి ఆరోగ్యం కూడా చాలా వరకూ చెడిపోతుంది, ముఖ్యంగా ఓ వ్యక్తి ఇదే చేశాడు ఓ వీడియో రూపంలో తన టాస్క్ వదిలి లక్షలు సంపాదించాలి అని భావించాడు, నేరుగా మూడు ఫుల్ విస్కీ బాటిల్స్ బల్లపై పెట్టుకున్నాడు… ఇందులో ఎలాంటి వాటర్ సోడా కలపకుండా నేరుగా తాగాలి అని వీడియో రికార్డ్ చేశాడు…అలా లైవ్ లో రికార్డు అవుతూ ఉంది.
ఈ సమయంలో రెండున్నర బాటిల్స్ తాగేసరికి ఒక్కసారిగా అతను కుప్పకూలిపోయాడు.. అక్కడ నుంచి అతను పైకి లేవలేదు.. వెంటనే ఆ లైవ్ చూసిన వారు పోలీసులకు ఆస్పత్రికి ఫోన్ చేశారు.. అంబులెన్స్ వచ్చి అతనిని తీసుకువెళ్లింది… కాని అప్పటికే అతను మరణించాడు అని తేలింది.
అయితే ఇది ఎవరైనా టాస్క్ చేయాలి అని ఇచ్చారా, లేదా అతను దీనిని సొంతంగా చేశాడా అనేది తేలాల్సి ఉంది.. అతని వయసు 48 ఏళ్లు అని తెలుస్తోంది.. మిచిగాన్ లో ఈ సంఘటన జరిగింది, ఇలాంటి ఆలోచన ఇలాంటి టాస్క్ లు చేయద్దు అంటున్నారు పోలీసులు వైద్యులు.