జీహెచ్ ఎంసీ…గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా టీఆర్ఎస్ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మీ ఎన్నికయ్యారు…ఇక ముందుగానే అందరూ ఆమె పేరుని ఊహించారు చివరకు ఆమె పేరే తెలిపారు..
మేయర్ అభ్యర్థిగా గద్వాల విజయలక్ష్మీ పేరును కార్పొరేటర్ ఫసియుద్దీన్ ప్రతిపాదించారు.
బంజారాహిల్స్ కార్పొరేటర్ గా రెండోసారి గద్వాల విజయలక్ష్మీ ఎన్నికయ్యారు..గులాబీ పార్టీలో సీనియర్ నేత కేసీఆర్ కు బాగా సన్నిహితులు అయిన కే.కేశవరావు కుమార్తె విజయలక్ష్మీ. తండ్రి వారసత్వంతో రాజకీయంగా ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు, ఇక తొలిసారి బంజారాహిల్స్ కార్పొరేటర్ గా గెలిచారు, ఇక ఇటీవల కూడా ఆమెకి టికెట్ ఇవ్వడంతో రెండోసారి ఆమె గెలుపొందారు.
విజయలక్ష్మీ ఉన్నత విద్య చదివారు, ఆమె జర్నలిజంలో డిగ్రీ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 18 ఏళ్లు అమెరికాలో నివశించారు ఆమె, తర్వాత డ్యూక్ వర్శిటీలో పరిశోధన సహాయకురాలిగా పని చేశారు. 2007 లో ఆమె ఇండియా వచ్చేశారు, రాజకీయాల్లో చేరాలి అని డిసైడ్ అయ్యాక ఆమె అమెరికా పౌరసత్వం వదులుకున్నారు..బాబీరెడ్డిని ఆమె వివాహం చేసుకున్నారు.