గత వారం రోజులుగా పెరిగిన బంగారం ధర నేడు మార్కెట్లో కాస్త తగ్గుముఖం పట్టింది.. నేడు పుత్తడి వెండి బంగారం ధరలు కాస్త తగ్గాయి. మరి పుత్తడి ధరలు నేడు మార్కెట్లో ఎలా ఉన్నాయి బులియన్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది అనేది ఓసారి చూద్దాం,
ఇక ఏపీ తెలంగాణ హైదరాబాద్ లో బంగారం ధరలు చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.210 తగ్గింది. దీంతో రేటు రూ.48,600కు చేరింది… అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర తగ్గింది.. ధర రూ.200 తగ్గడంతో రూ.44,550కు చేరింది.
వెండి రేటు మరింత తగ్గింది. కేజీ వెండి ధర రూ.1500 తగ్గింది, దీంతో రేటు రూ.72,900కు చేరింది, అయితే బంగారం వెండి ధరలు వచ్చే రోజుల్లో మరింత తగ్గే సూచనలు ఉన్నాయి అంటున్నారు వ్యాపారులు… బులియన్ ట్రేడ్ అనలిస్టులు చెప్పే దాని ప్రకారం బంగారం వచ్చే రోజుల్లో మరింత తగ్గుముఖం పడుతుంది అంటున్నారు.