ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నారు, ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నారు..
కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ ఎన్టీయార్ కాంబినేషన్లో మైత్రీ మూవీస్ సంస్థ ఓ భారీ సినిమాను తీయనుంది అని దాదాపు మూడు నెలలు వార్తలు వినిపించాయి.. అయితే త్రివిక్రమ్ సినిమా వస్తుంది అని తెలియగానే ఆ వార్తలు ఆగిపోయాయి, ఇక ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ తో సినిమా చేస్తున్నారు.
ఎన్టీయార్-ప్రశాంత్ నీల్ సినిమా ఆగిపోయిందని టాక్ బయల్దేరింది. కాని ఇది వాస్తవం కాదట ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా రానుందట. సలార్ తర్వాత ఎన్టీఆర్ సినిమా ఉంటుంది అని తెలుస్తోంది.. అలాగే బాలయ్య గోపిచంద్ మలినేని కాంబో కూడా తెరకెక్కనుంది అని తెలుస్తోంది.
పవర్స్టార్ పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్లోని సినిమా మరో ఆరు నెలల తర్వాత స్టార్ట్ అవ్వనుంది, ఇక
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబి కాంబినేషన్లో సినిమా రానుంది ఇవన్నీ మైత్రీ మూవీస్ నిర్మించనుంది.