దర్శకుడు సుకుమార్ టాలీవుడ్ లో ఎంతో గొప్ప దర్శకుడు, అనేక సూపర్ హిట్ సినిమాలు తీశారు, ప్రతీ హీరో కూడా సుకుమార్ తో సినిమా చేయాలి అని భావిస్తారు… ఇక డిఫరెంట్ కథతో క్రియేటీవిటీ చాలా ఉంటుంది ఆయన స్టోరీలో. ముఖ్యంగా ఆయన కథలు మాటలు యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి, ఇక దర్శకుడిగా మంచి ఫేమ్ ఉంది ఆయనకు.
అయితే ఆయన దగ్గర పని చేసిన చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్లు దర్శకులుగా కూడా మారుతున్నారు.. వారికి కూడా సాయం చేస్తున్నారు వారి ఎదుగుదలకి… అయితే ఆయన దర్శకుడు కాకముందు ఏం చేసేవారో తెలుసా.. ఆయన మంచి లెక్చరర్.
లెక్కల మాస్టర్ గా పని చేశారు ఆయన.
1997-98 ఆ మధ్యలో సుకుమార్ గారి జీతం 70వేల వరకు ఉండేదట, ఆయనని ఏరికోరి మరీ తీసుకువచ్చి పాఠాలు చెప్పించేవారట.. అంతబాగా ఆయన మాథ్స్ చెప్పేవారట…తాజాగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు ఇంటర్ కాలేజ్ లో నేను సుకుమార్ గారితో సైకిల్ పై సినిమాకు కూడా వెళ్ళేవాళ్ళం అని తెలిపారు.. ఇక తర్వాత సినిమా పరిశ్రమలోకి వచ్చిన ఆయన
దర్శకుడు వివి.వినాయక్ దిల్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి నెలకు 500రూపాయలు అందుకున్నారు. కాని నేడు ఏకంగా 8 నుంచి 10 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్న టాప్ డైరెక్ట్ ఆయన.. నిజంగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి సుకుమార్ అంటారు టాలీవుడ్ లో అందరూ.