మన దేశంలో హోటల్ వ్యాపారానికి మంచి గిరాకీ ఉంటుంది, ఫుడ్ టేస్ట్ ఉండాలే కాని ఎంత దూరం నుంచి అయినా వచ్చి తింటారు, అందుకే చిన్న చిన్న హోటల్స్ కూడా అసలు ఖాళీ లేకుండా గిరాకీగా ఉంటాయి…ఇటీవల మనోళ్ల క్రియేటివీటి మాములుగా ఉండటం లేదు.. గతంలో మన పేర్లపైనే హోటల్ పేర్లు ఉండేవి …కాని ఇప్పుడు పేర్లు చాలా డిఫరెంట్ గా పెడుతున్నారు.
ఇటీవల ఇలాంటి ఓ హోటల్ చూశాం, నువ్వెంత తింటావు అనే రెస్టారెంట్ ఒకటి.. అలాగే పొట్ట పెంచుదాం మరో రెస్టారెంట్ ..ఇలా అనేక రకాల సరికొత్త పేర్లు పెడుతున్నారు… తాజాగా రాజమండ్రిలో దానవాయిపేటలో కొత్తగా ఓ హోటల్ ప్రారంభమయింది. ఆ హోటల్ పేరు నా POTTA నా ISTAM, ఏదో సినిమా డైలాగ్ గుర్తు వచ్చిందా అది సినిమా డైలాగ్ కాని ఇది రియల్ హోటల్ నేమ్..
ఈ పేరు చూసి చాలా మంది భలే వెరైటీగా ఉంది అంటున్నారు.. సోషల్ మీడియాలో ఈ పేరు తెగ వైరల్ అవుతోంది, ఇక గోదారోళ్ల మజాకా అంటున్నారు మరికొందరు.. పాతాళభైరవి, మాయాబజార్ తిన్నదానికే బిల్లు ఇలా అనేక రకాల హోటల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఈ కొత్త హోటల్ కి జనం బాగానే వస్తన్నారట.
https://www.facebook.com/ourrajamahendravaram/posts/3856924701026065