ఇటీవల హైదరాబాద్ శివార్లలో ఫార్మసీ స్టూడెంట్ కిడ్నాప్ వ్యవహారం రెండు తెలుగు స్టేట్స్ లో ఎంత సంచలనం అయిందో తెలిసిందే… అయితే ఇప్పుడు తాజాగా దీనిపై పోలీసులు అనేక విషయాలు తెలిపారు… అసలు కిడ్నాప్ వ్యవహారం మొత్తం ఆ యువతి ఆడిన డ్రామా అని స్పష్టం చేశారు… మొత్తం 100 సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు.. ఆమె చెప్పినదానికి అక్కడ జరిగిన దానికి పొంతన లేదు.
అయితే ఆమె కావాలనే ఇలా చేసింది అని తెలుస్తోంది, ఇందులో అసలు ఆటో డ్రైవర్ల తప్పు లేదు అని తేల్చారు.. అసలు ఆ సమయంలో ఆటో డ్రైవర్లు వేరే ప్రాంతాల్లో ఉన్నారు అన్నీ ఆధారాలు చూశారు.. దీంతో వారికి ఏ సంబంధం లేదు అని తేలింది.
సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు అసలు అక్కడ ఆమెపై అత్యాచారం జరిగింది అనే ఆధారాలు లేవు.
ఇక ఆమె ముందు స్టాప్ లో ఆటో దిగింది అని తేలింది. సో ఇక్కడ కిడ్నాప్ అనేది జరగలేదు..నడుస్తూ ఘట్కేసర్ ఏరియాలోని శ్రీనిధి కాలేజీ పక్క నుంచి వెళ్లింది..తన దుస్తులు తానే తీసేశానని చెప్పింది విచారణలో…. ఇంట్లో నుంచి తనను బయటకు పంపడం కోసమే ఇలా చెప్పానని అసలు నిజం చెప్పింది..ఆమెను ఎవరూ కిడ్నాప్ చేయలేదు, రేప్ చేయలేదు అని తేలింది విచారణలో.