ఉప్పెన చిత్రం సూపర్ హిట్ అయింది, ఇక తొలి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకున్నారు దర్శకుడు బుచ్చిబాబు.
ఇక ఆయన సుకుమార్ దగ్గర లెక్కలు నేర్చుకుని ఇప్పుడు దర్శకత్వంలో మెలకువలు నేర్చుకుని నేడు సక్సస్ ఫుల్ దర్శకుడు అయ్యారు. ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది.
మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టితో ఉప్పెన చిత్రం తీశారు ఆయన… ఇక ఆయన తాజాగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు… ఆయన గురించి అనేక విషయాలు చెప్పారు, ఆయనకు సినిమాలు అంటే చాలా ఇష్టం, ముఖ్యంగా ఇక్కడ ఏదో సంపాదించాలి సాధించాలి అని రాలేదు …మా అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉంటుంది.. దర్శకుడు బుచ్చి బాబు అని ఓ సినిమాకి అయినా నీ టైటిల్ ఉండాలి అని.. అలా ఒక్క సినిమా చాలు మళ్లీ ఇక్కడకి వచ్చెయ్ అని చెప్పింది.
ఇక మాఊరిలో మేము బాగా ధనవంతులు మాకు ఎంతో ఆస్తి ఉంది ఖాళీగా ఉన్నా జీవితం వెళ్లిపోతుంది.. సినిమా తీయాలి అనే కోరికతో ఇలా వచ్చాను…మాకు డబ్బులు, ఆస్తులు ఎక్కువే ఉన్నాయి. ఇక ఒక సినిమా చేశావు కదా వచ్చెయ్ అని అమ్మ అంటుంది కాని సినిమాలు చేస్తాను అని చెప్పారు ఆయన.