పాము కనిపించింది అంటే ముంగీస వదిలిపెట్టదు… అస్సలు దానిని చంపే వరకూ తరుముతూనే ఉంటుంది, అయితే పాము కరిస్తే ముంగీస చావదు అని చాలా మంది భావిస్తారు, అయితే ముంగీస పాము పోట్లాటలో పాము వెనక్కి వెళుతుంది కాని ముంగీస వెళ్లదు అనుకుంటారు. కాని అది తప్పు ఓటమి అంచున ఉన్న జంతువు వెనక్కి వెళుతుంది కొన్ని చోట్ల ముంగీస కూడా వెనక్కి వెళ్లిన సందర్బాలు ఉన్నాయి.
పాము కరిస్తే దాని నుంచి వచ్చే విషం మన రక్తాన్ని పలుచబడేలా చేస్తుంది…. మెదడు గుండెలకు ఈ కలుషితమైన రక్తం చేరి శరీరం పనికి రాకుండా చేస్తుంది.. అయితే ముంగీసలు ఇలా పాము కాటు వేయకుండా చాకచక్యంగా సెకన్ వ్యవధిలోనే తప్పించుకుంటాయి, అందుకే దాదాపు అసలు పాముకి కరిచే ఛాన్స్ ఇవ్వవు.
పాము నుంచి తప్పించుకోవడానికి దీని బాడీ రక్షణ ఇస్తుంది అనే చెప్పాలి…దీనికి విషం తగలకుండా జాగ్రత్తగా ఉంటుంది.
పాము వెనుక భాగం కొరుకుతుంది ముంగీస.. దీంతో దాని వేగం తగ్గుతుంది పాము ఏమీ చేయలేక ఇబ్బందిపడుతుంది.
పాము కరిస్తే దీనికి విషం ఎక్కుతుంది. ఎక్కువ మోతాదులో ఎక్కితే ముంగీస చనిపోతుంది..వందలో 95 శాతం ఇవి పాము కాటు వేయకుండానే చూస్తాయి….పాము వాసన దీనికి నచ్చదు అందుకే దీనిని చంపేస్తుంది.