ఏదైనా హోటల్ కు వెళ్లి మనం ఫుడ్ తీసుకుంటే మనం దానికి బిల్ పే చేస్తాం.. మనకు సర్వ్ చేసిన వారికి వంద లేదా రెండు వందలు ఇస్తాం.. ఇంకా ధనవంతులు అయితే వెయ్యి రూపాయలు ఇస్తాం, మనకు బాగా సర్వ్ చేశారు అనిపిస్తే ఐదువేలు ఇస్తాం. ఇక ఇలా కాకుండా లక్షల రూపాయల టిప్ ఇచ్చిన వారు కస్టమర్లు చాలా మంది ఉన్నారు.. పలు ఘటనలు మనం విన్నాం.
ఇటీవల యూఎస్ లోని న్యూయార్క్ లో తనకు సర్వ్ చేసిన ఓ యువతికి ఓ కస్టమర్ ఏకంగా 13 వేల డాలర్లు అంటే 9.42 లక్షల టిప్ ఇచ్చాడు… ఇప్పుడు ఇది పెను వైరల్ అవుతోంది. న్యూయార్క్ లో అది లిల్లీస్ కాక్ టైల్ రెస్టారెంట్… అక్కడ
ఉల్యానా హ్రుచాక్ అనే యువతి వెయిట్రెస్ గా పని చేస్తోంది….అక్కడకు డైలీ వచ్చే కస్టమర్ రాబిన్ స్కాల్, ఇలా ఆమె కష్టాన్ని చూసిన అతను ఆమెకి సాయం చేయాలి అని అనుకున్నాడు.
తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో 1.41 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉండగా, వారందరికీ ఆమె గురించి చెప్పాడు, ఇలా పోస్టు పెట్టిన సమయంలో అతని ఖాతాలో అందరూ నగదు జమచేశారు… ఐదు నిమిషాల్లో13 వేల డాలర్లు పోగయ్యాయి. ఆమెకి ఈ నగదు అందచేసి వీడియో పెట్టాడు, ఆమె ఎంతో సంతోషించింది.