కృష్ణగాడి వీర ప్రేమగాథ ఈసినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయం అయింది హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా. తర్వాత పలు తెలుగు సినిమాలు చేసింది, అయితే ఇప్పుడు ఎఫ్ 3 సినిమా చేస్తోంది ఈ తార, అయితే తాజాగా ఆమె పెళ్లి పీఠలు ఎక్కనుంది, దీనిపై తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి, ఇక మెహ్రీన్ కౌర్ కు కాబోయే వరుడు ఎవరు అంటూ ఆమె అభిమానులు చర్చించుకుంటున్నారు.
మాజీ ముఖ్యమంత్రి మనవడితోనే ఈమె పెళ్లి పీటలెక్కబోతుంది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ కుటుంబానికి కోడలిగా వెళ్లనుంది మెహ్రీన్. ఇక ప్రస్తుతం వరుడి తండ్రి కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు,
కాంగ్రెస్ నేత, ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కొడుకు భవ్య బిష్ణోయ్ను ఆమె వివాహం చేసుకోనుంది.
ఇక రాజకీయ కుటుంబంలోకి ఆమె కోడలిగా వెళ్లనుంది.. మార్చ్ 13న ఈ ఇద్దరి నిశ్చితార్థం జరగనుంది. రాజస్థాన్లోని జోధ్ పూర్ విల్లా ప్యాలస్లో ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ జరగనుంది. ఇక పెళ్లిపై ఇంకా డేట్ ప్రకటించలేదు, ఇక ఈ ఏర్పాట్లలో ఇరు కుటుంబాలు బిజీగా ఉన్నాయి… ఇక ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నారట.