విద్యాబుద్దులు నేర్పాల్సిన టీచర్ పక్కదారి పట్టాడు.. విద్యార్దినికి ప్రేమ పాఠాలు బోధించాడు… చివరకు ఆమె కూడా ఆ మాస్టారు మాయలో పడింది, అతను చెప్పిందే చేసింది, చివరకు ఆ మాస్టారు బుద్ది అతను చేసిన తప్పులు బయటపడ్డాయి వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లింది.
మాస్టారుగా పని చేస్తున్న 26 ఏళ్ల వ్యక్తి 10 వ తరగతి చదివిని అమ్మాయితో చనువుగా ఉన్నాడు, గత ఏడాది ఆమెకి స్కూల్ పూర్తి అయింది, అయినా ఆమెతో టచ్ లో ఉన్నాడు, ఇక ప్రేమిస్తున్నాను అని చెప్పడంతో ఆమె కూడా నమ్మేసింది.. అతనితో వెళ్లిపోయింది.. చివరకు పెళ్లి చేసుకున్నారు ఇద్దరూ… ఇక కొంతకాలానికి అతని నిజస్వరూపం బయటపడింది.. అతనికి పెళ్లి అయి ఓ బాబు ఉన్నాడు అని తెలిసింది.
దీంతో అతన్ని నిలదీసింది కాని అతను మరింత రెచ్చిపోయి ఆమెని హింసించాడు… కాని ఆమె అతనికి బుద్దిచెప్పాలి అని పోలీస్ స్టేషన్ కు వెళ్లింది… చివరకు అతనిపై కేసు నమోదు చేసింది.. వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు, అమ్మాయిలు ఇలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తున్నారు పోలీసులు.