పిల్లలకు జ్ఞాపకశక్తి మెరుగుపడాలి అని చాలా మంది అనేక రకాల మందులు వాడతారు.. లేహ్యాలు వాడతారు.. సో ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి అని వైద్యులు చెబుతున్నారు.. వీటి వల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్ లు కూడా వస్తాయి.
ఓ ట్యూషన్ మాస్టర్ మాత్రం పిల్లలకు జ్ఞాపకశక్తి పెరగాలని ఓ తెలివి తక్కువ పని చేశాడు.. ఇప్పుడు స్టేషన్ లో ఊచలు లెక్క పెడుతున్నాడు.
ఢిల్లీలోని డిగ్రీ చదివిన ఓ యువకుడు ఇంటి దగ్గర పిల్లలకు ట్యూషన్ చెబుతున్నాడు.. అందరూ 6 నుంచి 10 వ తరగతి స్టూడెంట్స్… అయితే వారికి బాగా జ్ఞాపకశక్తి మెరుగు చేయడానికి అతడు ఇంజెక్షన్లు ఇస్తున్నాడు. ఇక వారు ఇంట్లో కూడా ఇలా ఇంజెక్షన్లు తీసుకున్నారు, దీంతో ఓ పెరెంట్ చూసి ఇది డ్రగ్ అని భయపడ్డారు. అయితే తమ పిల్లవాడిని అడిగితే అసలు విషయం చెప్పాడు, ఇది ట్యూషన్ టీచర్ ఇచ్చారు అని.
వెంటనే మిగిలిన వారి పేరెంట్స్ ని కూడా అడిగారు… వారు కూడా బ్యాగ్ చెక్ చేస్తే ఈ ఇంజెక్షన్లు దొరికాయి.. దీంతో వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లలకు ఇంజెక్షన్లు ఇస్తే వారిలో మెమొరీ పవర్ పెరుగుతుందని ఇలాంటి పని చేశాడు, ఇప్పుడు అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు.కొన్ని యూట్యూబ్ చానల్స్ చూసి పిల్లలకు ఇలాంటి ఇంజెక్షన్లు ఇచ్చాను అని తెలిపాడు.