నట ప్రపూర్ణ మోహన్‌బాబు నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే… ఎన్టీఆర్ తర్వాత అంతలా డైలాగ్ చెప్పే నటుడు మోహన్ బాబు అంటారు టాలీవుడ్ లో అందరూ….ఆయన హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్బుతమైన చిత్రాలు చేశారు.. అయితే ఆయన పేరుకు ముందు కలెక్షన్ కింగ్ ఉంటుంది. మరి టాలీవుడ్ లో ఆయన సినిమాలు అంత భారీగా కలెక్షన్లు వచ్చేవి.. మరి ఆయనకు ఎలా బిరుదు వచ్చింది అనేది చూద్దాం.
టాలీవుడ్ చిత్ర సీమలోకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా అడుగుపెట్టి ఆ తర్వాత హీరోగా
విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అంచెలంచెలుగా ఎదిగారు మోహన్ బాబు..హీరోగా పలు విజయవంతమైన సినిమాలు చేస్తున్న సమయంలో ఆయనకు కలెక్షన్ కింగ్ అనే బిరుదు వచ్చేలా చేసిన దర్శకుడు బి.గోపాల్.
బి గోపాల్ మోహన్ బాబు కాంబోలో నాలుగు చిత్రాలు వచ్చాయి… ఈ నాలుగు ఆల్ టైం హిట్ చిత్రాలే..
అసెంబ్లీ రౌడీ ఈసినిమా భారీ విజయం సాధించింది… ఈ సినిమాతో ఆయనకు కలెక్షన్ కింగ్ అనే బిరుదు వచ్చింది. తర్వాత బి గోపాల్ తో
బ్రహ్మ
కలెక్టర్ గారు
అడవిలో అన్న చిత్రాలు చేశారు.