ప్రపంచంలో ధనవంతుడు అంటే వెంటనే మనం చెప్పే పేరు అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్, నాలుగు సంవత్సరాలుగా ఆయన ఈ ప్లేస్ లో ఉన్నారు, అయితే తాజాగా ఆ ప్లేస్ లోకి ఎలాన్ మస్క్ చేరుకున్నారు, ఇక ఆయన కంపెనీ విలువ అమాంతం పెరిగింది. దీంతో బెజోన్ ని దాటేశారు మస్క్, అయితే తాజాగా మళ్లీ మొదటిస్ధానానికి అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ చేరారు.
టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ కు చెందిన కంపెనీల ఈక్విటీ వాటాల విలువ పడిపోవడంతో భారీగా ఆస్తుల విలువ తగ్గింది, ఇక
టెస్లా వాటాల విలువ 2.4 శాతం పడిపోయింది. దీంతో ఎలాన్ మస్క్ ఆస్తుల విలువ 4.6 బిలియన్ డాలర్ల మేరకు తగ్గింది.
దీంతో మళ్లీ బెజోస్ మొదటిస్ధానానికి వచ్చారు
జెఫ్ ఆస్తుల విలువ 191.2 బిలియన్ డాలర్లు, ఇది ఎలన్ మస్క్ కంటే 955 మిలియన్ డాలర్ల ఎక్కువ అని తెలిపారు, ఇలా ఇప్పటి వరకూ ప్రపంచ ధనికుడిగా ఎలాన్ మస్క్ తొలి ఆరు వారాలు కొనసాగారు. ఇటీవల ఆయన క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టిన విషయం తెలిసిందే.