వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా ఇది నిజంగా జరిగిని ఘటనే, ఆ వ్యక్తికి వివాహం అయింది, భార్యతో బాగానే ఉంటున్నాడు, కాని మరో ప్రియురాలు పరిచయం అయింది …ఇక్కడే అసలు కథ మొదలైంది, ఇక ఇద్దరూ బాగా దగ్గర అవ్వడంతో వారిద్దరూ పారిపోయారు.. దీంతో భార్య అతనిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు మొత్తానికి అతన్ని పట్టుకున్నారు.
ప్రియురాలితో పెళ్లి జరిగిందని చెప్పడంతో, భార్య దిగి వచ్చింది. మొత్తానికి భార్య ఓ ఒప్పందం పెట్టింది, మూడు రోజులు భార్య దగ్గర మూడు రోజులు ప్రియురాలి దగ్గర ఉండాలి అని షరతు పెట్టింది. అయితే ఇదంతా ఒకే అయ్యాక మా ఇద్దరికి పెళ్లి జరగలేదు నన్ను లైంగికంగా ఇబ్బంది పెట్టాడు అని తర్వాత రోజు ప్రియురాలు అతనిపై కేసు పెట్టింది.
ఈ ఘటన రాంచీలో జరిగింది… అయితే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలి అని పోలీసులు అతని ఇంటికి వస్తే, భార్య ఇంట్లో లేడు అని చెప్పింది….అయితే భార్యే అతన్ని ఎక్కడికో పంపించి ఉంటుంది అని భావిస్తున్నారు పోలీసులు, అతనికోసం పోలీసులు వెతుకున్నారు.