ఉప్పెన సినిమా ఊహించని కలెక్షన్స్ సాధిస్తోంది.. ఇప్పటి వరకూ తెలుగులో రికార్డులు క్రియేట్ చేసిన సినిమా దేశంలో సరికొత్త రికార్డుని నమోదు చేసింది. నిజంగా వైష్ణవ్ తేజ్ కు తొలి సినిమా రికార్డు ఇచ్చింది, ముఖ్యంగా డెబ్యూ సినిమా అంటే ఇలా ఉండాలి అని అందరూ కోరుకుంటున్నారు… ఇక మెగా హీరోలు కూడా ఎవరికి రాని రికార్డు ఆయన సొంతం చేసుకున్నారు.
ఉప్పెన సినిమా 5 రోజుల్లోనే 32 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో ఉన్న రికార్డు దాటేసింది,
డెబ్యూ సినిమాతో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డు హృతిక్ రోషన్ పేరు మీద ఉంది ఇప్పటి వరకూ. 21 ఏళ్ళ కింద ఆయన నటించిన కహో నా ప్యార్ హై సినిమా అప్పట్లో 42 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇదే ఇప్పటి వరకూ సంచలన రికార్డు కాని ఇప్పుడు వైష్ణవ్ ఆసినిమా రికార్డు దాటేశారు.
ఉప్పెన 43 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇక గ్రాస్ చూసుకుంటే 50 కోట్లు వచ్చింది అని తెలుస్తోంది, మొత్తానికి డెబ్యూ సినిమాతో సరికొత్త రికార్డు నెలకొల్పాడు వైష్ణవ్ తేజ్. ఇక దర్శక నిర్మాతలు చాలా ఆనందంలో ఉన్నారు.