అందమైన కళ్లు, అమాయకత్వం తో చూపు, అద్బుతమైన మాట, ఒత్తు అయిన జుట్టు, ఇవన్నీ కూడా అనుపమకు ప్రత్యేక క్వాలిటీస్ అనే చెప్పాలి… హీరోయిన్ గా ఆమెకు ఎంతో క్రేజ్ ఉంది. కేరళలోని త్రిసూర్ జిల్లా, ఇరంజలకుడ పట్టణం అనుపమ పరమేశ్వరన్ స్వస్థలం. ఆమె 1996 ఫ్రిబ్రవరి 18 న పుట్టింది…ఆమెకు ఓ సోదరుడు అక్షయ్ ఉన్నాడు… ఇక ఆమె డిగ్రీ చదువుతున్న సమయంలో ఆమెకి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.
ఇక సినిమాలు చేస్తూనే తర్వాత డిగ్రీ పూర్తి చేసింది ఈ అందాల తార… ఇక ఇంట్లో అందరూ ఆమెను పొన్ను అని ముద్దుగా పిలుస్తారు… ఇక ఆమె చిన్నతనంతో థియేటర్ ఆర్ట్స్కు సంబంధించిన స్కూల్లో జాయిన్ అయింది… అక్కడే ఆమె యాక్టింగ్ నేర్చుకుంది.. స్కూల్లో పలు డ్రామాలు వేసింది.
ఇక ఆమెలోని టాలెంట్ గుర్తించిన ఫ్రెండ్ ఆమెని మలయాళ ప్రేమమ్ సినిమా ఆడిషన్స్కు ఫొటోలు పంపమని కోరింది. అయితే ఆమె అంత ఇంట్రస్ట్ చూపించలేదు.. తర్వాత ఆమె పంపింది, ఇలా ఆమెకి అవకాశం వచ్చింది ..అప్పటికి అనుపమకు 19 ఏళ్లే వయసు..తర్వాత అఆ చేసింది, ఆ తర్వాత అవకాశాలు వరించాయి. ప్రేమమ్, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ ఇలా సూపర్ హిట్ సినిమాలు అవకాశాలు వచ్చాయి, ప్రస్తుతం నిఖిల్ సరసన 18 పేజీస్ లో నటిస్తోంది.