ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది ఈ మహమ్మారి వల్ల లక్షలాది మంది మరణించారు… ఇంకా చాలా ప్రాంతాలు లాక్ డౌన్ లో ఉన్నాయి.. అయితే ఇప్పుడు వాక్సిన్ వచ్చింది పలు దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేస్తున్నారు..లక్షలాది మంది ఈ కరోనా టీకా తీసుకుంటున్నారు… అయితే ఇలా కరోనా విజృంభన కొనసాగుతున్న వేళ తాజాగా మరో కొత్త వైరస్ పురివిప్పింది.
ఆఫ్రికా దేశాల్లో ఎబోలా పంజా విసురుతోంది. తాజాగా గినియాలో ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే ఐదుగురు మరణించారు. ఇంకా పలు కేసులు నమోదు అవుతున్నాయి, ఇప్పుడు ఈ దేశంలో కేసులు పెరగడంతో ఆందోళన చెందుతున్నారు జనం.
ఈ వైరస్ మరిన్ని దేశాలకు విస్తరించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది… అంతేకాదు సరిహద్దు పంచుకుంటున్న మరో ఆరు దేశాలను కూడా ఆఫ్రికాలో అలర్ట్ చేసింది. గనియాలో ఇప్పటి వరకూ మొత్తం 109 కేసులు రిజిస్టర్ అయ్యాయి… ఇందులో ఐదుగురు మరణించారు… కాంగో దేశంలోనే ఇప్పటివరకు 300 ఎబోలా కేసులను గుర్తించినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.