తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో వైష్ణవ్ తేజ్ తొలి చిత్రంతోనే పెద్ద హిట్టు కొట్టారు, తొలి సినిమాతోనే డెబ్యూ హీరోగా దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు, అయితే మెగాస్టార్ కుటుంబం నుంచి మెగా హీరోలు అందరితో పాటు ఇటు టాలీవుడ్ ప్రముఖులు అందరూ కూడా అతనిని ప్రశంసిస్తున్నారు, ఇక తాజాగా ఉప్పెన సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు ఆయన.
అయితే తాజాగా తన తదుపరి చిత్రాలపై కూడా ఫోకస్ చేశారు, కథలు వింటున్నారు..
ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో నటించే అవకాశం ఈ మెగా హీరోకి వచ్చింది. కొండపొలం పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో వైష్ణవ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది, ఇక ఇది త్వరలోనే విడుదల కానుంది.
ఇక తాజాగా పలు కథలు వింటున్నారు ఆయన.. అయితే టాలీవుడ్ టాక్ ప్రకారం నాగార్జున ఆయన సొంత బ్యానర్ లో వైష్ణవ్ తేజ్ తో ఓ చిత్రం చేయాలి అని చూస్తున్నారట…ఓ కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ప్రకటన రానుంది అంటున్నారు.