మనం ఏదో అర్జెంట్ పని మీద బయటకు వెళుతున్నాం, ఈ సమయంలో ఒక్కసారిగా స్కూటీలో నుంచి పాము బయటకొచ్చింది ఇక ఆ పరిస్దితి ఎలా ఉంటుందో తెలిసిందే, ఒక్కసారిగా ఆ బండి ఆపేసి పక్కకు వచ్చేస్తాం, ఈలోపు అది కాటు వేయకుండా జాగ్రత్తగా ఉంటాం, ఇక చెట్ల మధ్య తోటలు అడవుల మధ్య ఇళ్లు ఉన్నవారు బైక్ తీసే సమయంలో కచ్చితంగా చూసుకోవాలి లేకపోతే ఇలాంటివి చాలా ప్రమాదాలకు కారణం అవుతాయి.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని స్కూటీపై విజయవాడ వెళ్లింది ఓ యువతి . అక్కడ పనులు చక్కబెట్టుకుని తిరిగి సొంత ఊరికి బయల్దేరారు. అయితే ఒక్కసారిగా స్కూటీ డోమ్లో నుంచి తాచు పాము పైకి లేచింది.. ఒక్కసారిగా ఆమె షాక్ వెంటనే బండి వదిలేసి పక్కకు వచ్చేసింది, పాము లైట్ డోమ్ లోకి వెళ్లిపోయింది.
వెంటనే మెకానిక్ సాయంతో స్ధానికులు ఆపాముని బయటకు తీశారు. పాము స్కూటీలోనే అటూ ఇటూ తిరగడంతో కొద్దిసేపు కంగారుపడ్డారు. ఆమె ఆపకపోయి ఉంటే అది కచ్చితంగా కాటు వేసింది అంటున్నారు, అందుకే బైక్ కారు తీసే సమయంలో జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే ప్రమాదమే.
Attachments area