ఈ కరోనా సమయంలో ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇంకా కొన్ని దేశాలు కఠినమైన లాక్ డౌన్ లో ఉన్నాయి, ఇక ఎవరైనా ఈ రూల్స్ మీరితే వారికి శిక్షలు వేస్తున్నారు భారీగా ఫైన్లు విధిస్తున్నారు.. అయితే ఓ అధికారి ఓ మహిళకు కరోనా రూల్స్ ఉల్లంఘించింది అని ఫైన్ వేశాడు. చివరకు ఏం జరిగిందో ఇప్పుడు చూడండి.
పెరూ రాజధాని లిమాలో కరోనా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన ఓ మహిళను పోలీస్ అధికారి అడ్డుకున్నారు. ఆమెని ఫైన్ కట్టాలి అని చెప్పారు, ఆమె ఎంతో రిక్వెస్ట్ చేసింది ఆయన నో అన్నాడు, చివరకు ఆమె ఫైన్ కు బదులు కిస్ ఇస్తాను అని చెప్పింది ముందు నో చెప్పిన ఆ ఆఫీసర్ తర్వాత ఒకే అన్నాడు.
ఆమెను ముద్దు పెట్టుకోవడం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఈ వీడియో వైరల్ కావడంతో మిరాఫ్లోర్స్ మేయర్ లూయిస్ మొలినా దృష్టికి వెళ్లింది. వెంటనే అతనిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు, దీనిపై విచారణ చేస్తున్నారు. ఇక ఈ దేశంలో కరోనా వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది.