టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ తన కుటుంబాన్నీ పెద్దగా సినిమా ఫంక్షన్లకు తీసుకురారు అనేది తెలిసిందే… కేవలం కుటుంబంలో జరిగే ఫంక్షన్లకు మాత్రమే హాజరు అవుతారు.. ఇక వారి పిల్లల గురించి కూడా పెద్దగా ఎవరికి తెలియదు, ఇక ఆయన పెద్ద కుమార్తెకి 2019 మార్చిలో వివాహం చేశారు… అప్పుడు వారి కుటుంబం మొత్తం చాలా మందికి తెలిసింది.
ఇక పెద్ద కుమార్తె అశ్రిత హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత అయిన సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. . ఇక ఆమె ప్రస్తుతం తన భర్తతో కలిసి విదేశాల్లో ఉంటున్నారు, ఆమె ప్రొఫెషనల్ బేకర్, ఇక సోషల్ మీడియాలోఅనేక ఫుడ్ స్పెషల్స్ గురించి చెబుతూ ఉంటారు.
ఇన్ఫినిటీ ప్లాటర్ అనే పేరుతో ఓ అకౌంట్ను కూడా మెయింటైన్ చేస్తూ వస్తోంది. తాజాగా ఆమె తన భర్త గురించి పెళ్లి గురించి కొన్ని విషయాలు చెప్పింది, అయితే మాది లవ్ మ్యారేజ్ కాదని అరేంజ్డ్ మ్యారేజ్ అని తెలిపింది, ఇక తన భర్త నేను క్లాస్ మేట్స్ అని తెలిపింది.. రానా భార్య మిహీక అంటే చాలా ఇష్టమని మంచి ఫ్రెండ్ అని తెలిపింది.