ప్రభుత్వ టీచర్ అతను… విద్యార్దులకు చదువు చెప్పే గొప్ప ఉద్యోగం చేస్తున్న అతను… ఓ దారుణమైన పని చేశాడు.. విడాకులు ఇవ్వకుండా ఏకంగా నలుగురిని వివాహం చేసుకున్నాడు… గవర్నమెంట్ చట్టాలని లెక్క చేయకుండా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు ఈ టీచర్ , ఈ వ్యక్తి ముందు పెళ్లి చేసుకున్న భార్యకి విడాకులు ఇవ్వలేదు ఆమెకి విడాకులు ఇవ్వకుండా మరో మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.
ఈ నిత్య పెళ్లికొడుకు పై మొదటి భార్య రెండో భార్య ఫిర్యాదు చేశారు..ఒడిశాలోని కటక్ జిల్లాలోని మౌజా ప్రాంతానికి చెందిన కృష్ణ చంద్ర నాయక్ వయసు 45 సంవత్సరాలు, ప్రభుత్వ స్కూల్ టీచర్, అతనికి 2001 లో వివాహం అయింది, తర్వాత కాపురం చేస్తూ 2009లో మరో పెళ్లి చేసుకున్నాడు.
ఇక రెండో భార్య నుంచి నగలు నగదు తీసుకుని వేరేచోటికి వెళ్లిపోయాడు.. ఈ లాక్ డౌన్ వేళ మరో రెండు వివాహాలు చేసుకున్నాడు.. ఇక అతనికి ఇలా మూడ పెళ్లిళ్లు అయినట్లు ఇక నాల్గో భార్యకి తెలియదు. మొత్తానికి ఇలా మూడో భార్యకి విషయం తెలిసింది .ఆమె ద్వారా మొత్తం అందరికి తెలిసింది.. చివరకు పోలీస్ స్టేషన్ లో అతనిపై ఫిర్యాదు చేశారు.