బ్రేకింగ్ — రష్యాలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు ఇవే

-

ఓపక్క కరోనాతో బెంబెలెత్తిపోతున్నారు జనం… మరో పక్క బర్డ్ ఫ్లూ కూడా వేదిస్తోంది… ఇప్పుడు ఈ సమయంలో ఇది కేవలం జంతువులకి పక్షులకి మాత్రమే సోకుతుంది.. మనుషులకి సోకదు అని అందరూ భావించారు.. కాని తాజాగా ఈ బర్డ్ ఫ్లూ అనేది మనిషికి సోకింది.. ఇప్పుడు ప్రపంచం వ్యాప్తంగా అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

- Advertisement -

రష్యాలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకింది. ఈ విషయాన్ని అధికారికంగా నిర్దారించిన రష్యా శాస్త్రవేత్తలు, ఇన్ ఫ్లూయెంజా ఏ వైరస్ లోని హెచ్5ఎన్8 రకం తొలిసారిగా మానవునిలో కనిపించిందని డబ్లూహెచ్ వోకి తెలిపారు, మొత్తానికి దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఈ వార్త తెలిసింది, దీంతో అతి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెబుతున్నారు.

దక్షిణ రష్యా పరిధిలోని ఓ పౌల్ట్రీ ఫామ్ లో పనిచేస్తున్న ఏడుగురు కార్మికులను వెక్టార్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు తాజాగా పరిశోధన చేశారు, ఇక పక్షుల్లో గుర్తించిన ఈ వైరస్ ఇప్పుడు మనిషిలో కూడా గుర్తించారు.. కోళ్లు తదితర జంతువులతో నేరుగా కాంటాక్ట్ ఉన్న వారికే ఇది సోకే ప్రమాదం ఉందని వైద్యులు తెలియచేస్తున్నారు, అక్కడ వర్క్ చేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా గొంతు నొప్పి, జ్వరం అలసట, విరోచనాలు ఇవి నాలుగు రోజులు దాటి కనిపిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...