వారిద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్నారు, కొన్ని ఏళ్లు గడుస్తున్నా వారికి పిల్లలు లేరు.. ఇటీవల పలు విషయాలలో మనస్పర్దులు వచ్చాయి, అయితే భార్య భర్త విడాకులు కోరారు ..దీంతో అతను తట్టుకోలేకపోయాడు, భర్త ఆమెని అత్యంత దారుణంగా చంపేశాడు , అతను ప్రముఖ వైద్యుడు, అంతేకాదు ఆమెని కత్తితో పొడిచి రోడ్డుమీదకు తీసుకువచ్చి, కారుతో తొక్కి చంపేశాడు..ఈ దారుణమైన ఘటన తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో చోటుచేసుకుంది.
గోకుల్కుమార్ కాటాన్ కొళత్తూరులోని ఓ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. కీర్తన ను ప్రేమించి మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. ఇక వివాహం తర్వాత ఇల్లరికం వచ్చేశాడు, ఇక అత్తమామలు భర్త భార్య అందరూ కలిసి ఉంటున్నారు, ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి, దీంతో విడాకుల కోసం కోర్టుని ఆశ్రయించారు.
ఇటీవల కీర్తన ఇంటికి వెళ్లిన గోకుల్ ఆమెతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీయగా కత్తితో ఆమెని మామని కూడా పొడిచేశాడు.. ఇక అతని మామ కూడా హస్పటల్ లో చికిత్స పొందుతున్నాడు, ఇక అతను వేగంగా కారులో తప్పించుకుని వెళుతున్న సమయంలో ప్రమాదానికి గురి అయ్యాడు, అతను కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.