ఇప్పుడు మనం ఏటీఎంకు వెళితే డబ్బులు తీసుకుంటున్నాం.. అలాగే వచ్చే రోజుల్లో మనకు రైస్ ఏటీఎంలు గోధుమల ఏటీఎంలు అందుబాటులోకి రానున్నాయి.. తాజాగా కేంద్రం కీలక అడుగులు వేస్తోంది.ఆటోమెటిక్ గ్రెయిన్ డిస్సెన్సింగ్ మిషన్లను కేంద్రం అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది.. అంతేకాదు ప్రాధమికంగా ఐదు నగరాల్లో దీనిని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టారు.
పేద ప్రజలు రేషన్ దుకాణాలకు వెళ్లకుండానే ఈ మిషన్లను ద్వారా సరుకులను పొందే అవకాశం తీసుకొస్తున్నారు, ముందు అహ్మదాబాద్ నగరంలో దీనిని ప్రారంభిస్తారు, ఇక రేషన్ షాపుల దగ్గర నిలబడి క్యూ కట్టాల్సిన పనిలేదు. పేదలకు ఇవి బాగా సౌకర్యవంతంగా ఉంటాయి.
ఇక రేషన్ షాపు ఎప్పుడు తీస్తారో అనే అనుమానం వెయిటింగ్ ఉండదు. అయితే దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది.. ఎలా ఇస్తారు.. రేషన్ నెంబర్ ఇవ్వాలా ఇలాంటివి వచ్చే రోజుల్లో తెలియచేస్తారు, దీనిపై ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది, మొత్తానికి దీనిని సంబంధించి త్వరలోనే విధానాలు ప్రకటించనున్నారు.