చామ దుంపలని తీసుకోవడం వల్ల శరీరానికి చాలా మంచిది అయితే కొందరు మాత్రం ఈ చామ దుంపలు తీసుకోరు, ముఖ్యంగా కొందరికి నాలిక దురదపుడుతుంది అని అవాయిడ్ చేస్తారు.. అయితే అది వారికిపడనట్లు లెక్క, కొందరు ఇవి తింటే అలర్జీ వస్తుంది అంటారు అలాంటి వారు వీటికి దూరంగానే ఉండాలి, అయితే చామ దుంప కూర ఫ్రై ఏది తీసుకున్నా మంచిదే.. ఆరోగ్యప్రయోజనాలు పుష్కలంగా ఉంటాయి.
చామ దుంపలలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. అందుకే జీర్ణ ప్రక్రియ సులువుగా ఉంటుంది… మలబద్దకం ఉండదు, ముఖ్యంగా డైజేషన్ ఇబ్బందులు ఉండవు, ఇక ఇన్సులిన్ విడుదలను రెగ్యులేట్ చేయగలుగుతుంది మీ బాడీలోని… ఇవి తీసుకుంటే శరీరానికి సరిపడా ఐరన్ లభిస్తుంది.
ఎనిమియా సమస్యతో బాధ పడే వాళ్ళకి చామదుంప బాగా సహాయం చేస్తుంది. పోటాషియం కూడా అందిస్తుంది, దీనిని అతిగా కాకుండా వారానికి లేదా పదిరోజులకి ఓసారి తీసుకుంటే మీకు శరీరానికి అవసరం అయిన పోషకాలు అందిస్తుంది.
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి.