నిమ్మకాయలు ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తాయో తెలిసిందే.. అందుకే నిత్యం నిమ్మకాయ తీసుకునేవారు చాలా మంది ఉంటారు.. అయితే మీకో విషయం తెలుసా నిమ్మ ఆకులు కూడా మనకు ఎంతో మంచి చేస్తాయి. నిమ్మ ఆకుల్లో ఐరన్, క్యాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ బీ1, ఫ్లేవనాయిడ్స్, రైబోఫ్లోవిన్, సిట్రిక్ యాసిడ్ ఉంటాయి. సో నిమ్మ ఆకులతో ఏఏ ఉపయోగాలు అనేది చూద్దాం.
నిమ్మ ఆకులని వేడినీటిలో మరగబెట్టి పుక్కలిస్తే నోటిలో బ్యాక్టిరీయా ఉంటే పోతుంది.
చేతులకి క్రిములు ఉన్నాయి అని మీరు భావిస్తే లేత నిమ్మ ఆకులని చేతులతో నలపండి బ్యాక్టిరీయా పోతుంది.
తాజా నిమ్మ ఆకులు ఓ మూడు తీసుకోండి వాటిని వేడి నీటిలో నానబెట్టి ఆ నీరు తాగండి నిద్రలేమి సమస్య ఉండదు
నిమ్మ ఆకుల్ని నలిపి ఆ వాసన పీలిస్తే మంచిది వికారం వాంతులు అనిపిస్తే తగ్గుతుంది.
నిమ్మ ఆకులు నూరి పళ్లు తోముకున్నా మంచిదే
నోటిలో ఉన్న బ్యాక్టిరీయా పోతుంది వారానికి ఓరోజు మాత్రమే ఇలా చేయండి
స్నానం చేసే నీటిలో నిమ్మ ఆకుల్ని వేసుకుని స్నానం చేస్తే చర్మ ఆరోగ్యం బావుంటుంది.
చూశారుగా ఇలా నిమ్మ ఆకులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.