సముద్ర తీరంలో అరుదైన చేపలు చిక్కుతూ ఉంటాయి, మరీ ముఖ్యంగా మన విశాఖ కాకినాడ నెల్లూరు తీరాల్లో ఇలాంటి అరుదైన చేపలు బయట పడుతూ ఉంటాయి.. అంతేకాదు ఎండాకాలం నుంచి వర్షాకాలం మధ్య ఇలాంటి చేపలు అరుదుగా బయటపడుతూ ఉంటాయి…అచ్యుతాపురం మండలం పూడిమడక తీరంలో మత్స్యకారుల వలలో అరుదైన చేప బయటపడింది.
దీనిని చూసేందుకు స్ధానికులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు, ఎందుకంటే ఇది చాలా అరుదైన చేప అంటున్నారు,
సానిపాపగా పిలిచే ఈ చేప సముద్రంలో లోతైన ప్రాంతంలో ఉంటుంది. ఇక రాళ్ల దగ్గరకు చాలా అరుదుగా వస్తుంది అయితే ఈ వలలో తాజాగా ఇది పడింది.
చూడటానికి రకరకాల రంగుల్లో అందంగా కనిపించడంతో మత్స్యకారులు సానిపాపగా పిలుస్తారు. అంతేకాదు ఇది 200 గ్రాముల నుంచి రెండు కిలోల వరకూ పెరుగుతుంది రేటు కూడా వేలల్లో ఉంటుంది.. ఇక రుచికి రుచి కూడా ఉంటుంది. మరి ఈ చేపని మీరు చూడండి