పానీ పూరీ అంటే చాలా మందికి ప్రాణం… ఇలా కప్పు పట్టుకుని ఆ పానీలో ముంచి ఆ పూరీ ఇస్తే స్వర్గంలో తేలినట్లు ఉంటుంది తినేవారికి… మొత్తానికి ఈ పానీ పూరీ వ్యాపారులు చిన్న వివాదం వల్ల ఏకంగా పదుల సంఖ్యలో కొట్టుకున్నారు.
ఉత్తరప్రదేశ్లోని భాగ్పట్లో పానీపూరీ బండ్లు పక్క పక్కనే ఉన్నాయి, చాలా మంది వ్యాపారం చేసుకుంటున్నారు.
అయితే కస్టమర్లను ఇద్దరూ ఒకేసారి పిలిచారు.. ఈ సమయంలో వారిని పిలిచే సమయంలో మా బండి దగ్గరకు రా అంటే మా బండి దగ్గరకు రా అని అన్నారు, ఈ విషయంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది.లాఠీలు, కర్రలతో ఇరు వర్గాలకు చెందిన వారు రోడ్డెక్కారు.
ఇష్టం వచ్చినట్టు బాదుకున్నారు. వీరి గొడవతో మార్కెట్ రణరంగాన్ని తలపించింది. వెంటనే స్ధానికులు ఆపినా వారు ఆపలేదు, అంతేకాదు పోలీసులు ఎంట్రీ ఇచ్చారు, దీంతో వారిని అదుపుచేశారు, ఇందులో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
వీడియో చూడండి